ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైనా ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్‌లాకింగ్ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు. న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’’ అని అన్నారు.
ఈవీఎలంపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్
