హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయల్దేరిన జనం..

railwaystation-11.jpg

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇసకేస్తే రాలని జనం ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా పండగ సందర్భంగా అదనంగా 33 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. అలాగే, సంక్రాంతి పండగ ప్రయాణాలతో పాటు శబరి, కుంభమేళాకు వెళ్లే వారు కూడా ఉండటంతో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

Share this post

scroll to top