హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన ‘హైడ్రా’ కు ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ భేటీలో చట్టబద్ధత కల్పించడంతో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేకుండా కమిషన్ రంగనాథ్ డైరెక్షన్‌లో ఆ సంస్థ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం మాదాపూర్ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చేందుకు ప్రొక్లెయినర్లతో అధికారులు స్పాట్‌కు చేరుకున్నారు. ముందుగా కావూరి హిల్స్ లోని పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.
మరోసారి యాక్షన్‌లోకి హైడ్రా..
