హైడ్రా తరువాత ఈ 7 జిల్లాల్లో కూడా..

hidra-3.jpg

హెచ్‌ ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ, నోటిఫికేషన్‌ పూర్తి చేయాలని ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో కూడా  చెరువులు ఉండగా ఆయా జిల్లాల కలెక్షర్లతో సోమవరాం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ను  నిర్వహించారు. మరోపక్క నవంబరు 1వతేదీ లోగా అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో మెుత్తం 3,500 చెరువులు ఉండగా ఇప్పటివరకు 265 చెరువులను మాత్రమే నోటిఫై చేసినట్లు తెలిపారు.  త్వరలోనే మిగిలిన చెరువులను నోటిఫై చేసి అక్రమ నిర్మానాలను కూల్చివేస్తామని ఇదివరకే హైడ్రా  పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయపం నగరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెతున్నాయని చెప్పవచ్చు.

Share this post

scroll to top