తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..

raganath-28.jpg

హైడ్రా కమీషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మూసీలో సర్వేకు, హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు మూసీ లో కూల్చివేతలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి హైడ్రా నోటీసులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. కొంతమంది రాజకీయ లబ్ది కోసం మూసీలో భారీ ఎత్తున కూల్చి వేతలు జరుగుతున్నాయని మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న కూల్చి వేతలను హైడ్రాకు ఆపాదించడం సరికాదన్నారు రంగనాథ్. మూసీ నది పరివాహక ప్రాంతా వాసులకు హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు.. పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా హైడ్రా చూసుకుంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కచ్చితమైన సూచనలు జారీ చేసిందని రంగనాథ్ తెలిపారు.

Share this post

scroll to top