కులగణన పై బీజేపీకి జ్ఞానోదయం అయ్యిందని ఏపీపీసీసీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇది రాహుల్ గాంధీ విజయం ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకే చెందుతుందని ఆమె పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని వైఎస్ షర్మిల తెలిపారు. కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి వస్తే పెంచాలని రాహుల్ గాంధీ అన్నారని ఆమె గుర్తు చేశారు. రాహుల్ పోరాటంతో బీజేపీ దిగి వచ్చింది కులగణనకి తెలంగాణ, కర్ణాటక ఆదర్శం. ఈ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీంతో బీజేపీ దిగి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వెంటనే కులగణన పై టైమ్ బాండ్ కావాలి రిజర్వేషన్ల పరిమితి పై చర్చ జరగాలి.
కులగణన ఫార్మాట్ ఎలా ఉంటుందో బయట పెట్టాలని ఆమె కోరారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళు నన్ను గాంధారి అంటే బీజేపీ వాళ్లను నేను కౌరవులు అంటా అని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. బీజేపీ వాళ్ళు నిజంగా కౌరవులతో సమానమే అని ఆమె దుయ్యబట్టారు. ఈ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్తే నేను గాంధారి అని ఒప్పుకుంటా అని అన్నారు. ‘ఎటు చూసినా అన్యాయమే. ఒక్క మేలు జరగలేదు. ప్రత్యేక హోదా మోసమే, పోలవరం ప్రాజెక్టుకు అన్యాయమే. కడప స్టీల్ లేదు. విశాఖ స్టీల్ కి దిక్కులేదు విభజన హామీలు అన్ని మోసం చేసి ఇప్పుడు అమరావతికి అండగా ఉంటాం అంటే నమ్మాలా ?’ అందుకే బీజేపీ వాళ్ళు కౌరవులు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.