నిన్ను చాలా మిస్ అవుతానా..

mrunal-20.jpg

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మొదట సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ఆ తర్వాత సీతారామం చిత్రంతో హిట్ సాధించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుణ్ ధావన్, పూజా హెగ్డే కాంబోలో రాబోతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. అయితే డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మౌనీ రాయ్ కూడా నటిస్తోంది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

ఇక తాజాగా, మృణాల్, మౌనీరాయ్ ఓ ట్రిప్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని తెలుపుతూ మృణాల్ ఓ వీడియోను షేర్ చేసింది. నా గ్లాస్గో ట్రిప్‌ను ఇంత అద్భుతంగా చిరస్మరణీయంగా చేసినందుకు ధన్యవాదాలు. నేను మీ నుండి చాలా నేర్చుకున్నాను మౌనీరాయ్ నేను ఇప్పటికే మిమ్మల్ని మిస్ అవుతున్నాను. దీన్ని మెరుగైన సెటప్, కొరియోగ్రఫీతో చిత్రీకరించలేకపోయినప్పటికీ, ఈ టేక్ అందంగా ఉందని నేను భావిస్తున్నాను. మీరు నాకు నేర్పించడం మాత్రమే కాదు, నా అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీసుకురావడానికి మీరు నాకు సహాయం చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు క్యూటెస్ట్ మీ ఫ్రెండ్‌షిప్ చాలా బాగుందని అంటున్నారు.

Share this post

scroll to top