మందు తాగే తమ్ముళ్ల వల్లే గత ఎన్నికల్లో ఓటమి..

rachamallu-21-.jpg

గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. అయితే, ఇప్పటి వరకు ఆ ఓటమిపై రకరకాల విశ్లేషలు వచ్చాయి.. తాజాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మందు తాగే తమ్ముళ్ల వల్లే గత ఎన్నికల్లో వైసీపీతో పాటు తాను ఓటమి పాలయ్యాని అని వ్యాఖ్యానించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. మా ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారని కూటమి నేతలు ఎన్నికల్లో చేసిన మాటలు నమ్మి మందు బాబులు కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అయితే, ఎన్నికల తర్వాత మందు బాబులను, మద్యం వ్యాపారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాడు ప్రభుత్వం అమ్మిన మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని విమర్శించారు. నాడు విషం అని చెప్పిన మద్యం, నేడు అమృతంగా మారిందా అని ప్రశ్నించారు.

Share this post

scroll to top