తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర పనిచేేసే వాళ్లే ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు. తన అనుచరులు ఇరవై ఐదు మంది వరకూ ఇసుక వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారు వెంటనే పద్దతి మార్చుకోవాలి ఇసుక తరలింపు నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావద్దు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు. ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తాం అన్నారు జేసీ. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు.
ఉచిత ఇసుకపై జేసీ సంచలన కామెంట్స్
