అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ రోజు. ‘గంగోత్రి’ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. ఇక ఆ సినిమా సక్సెస్ అయినప్పటికి ఇతను హీరో ఏంటి? అసలు హీరో మేటీరియలే కాదు అని చాలా మంది విమర్శించారు. కానీ ఆ విమర్శలను అల్లు అర్జున్ మనస్పుర్తిగా తీసుకుని తనలోని లోపాల్ని సరిదిద్దుకుని ఆ తరువాత వరుస సినిమాలు తీశాడు. కట్ చేస్తే ‘పుష్ప’ తో తన సత్తా చూపించాడు బన్నీ. ఇప్పుడు రెండు వేల కోట్ల హీరోగా అల్లు అర్జున్ తన బ్రాండ్‌ను కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్థిర పడేలా చేశాడు.
సక్సెస్ అనేది ఎప్పుడు, ఎక్కడ.. ఏ రూపంలో వస్తుందో తెలియదు. కానీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు . ఇక్కడ బన్నీ కూడా అదే చేశాడు. తన కెరీర్ లో ‘బద్రీనాథ్’, ‘వరుడు’ వంటి చిత్రాలు మినిమం స్థాయిలో కూడా ఆడలేదు. అలా గడ్డు కాలం నడుస్తున్న టైంలోనే త్రివిక్రమ్‌తో చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మళ్లీ బన్నీని ట్రాక్‌లోకి తీసుకొచ్చాయి. తిరిగి ‘డీజే, సరైనోడు’ అంటూ మధ్యలో మాస్ హిట్లు బన్నీ ఖాతాలో పడ్డాయి. ‘రేసు గుర్రం’ తో బన్నీ అందరినీ ఆశ్చర్య పరిచాడు. అలా అక్కడి నుంచి బన్నీ రెంజ్ మారింది.
దీంతో ఎలా అయిన తన మార్కెట్ నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్‌ను కొల్లగొట్టేలనే సంకల్పంతో సుకుమార్‌తో ప్రయాణం స్టార్ట్ చేశాడు. వీరిద్దరి కాంబోలో ‘పుష్ప’ అనే ప్రభంజనం పుట్టింది. పుష్ప 1 కి కొన్ని కష్టాలు తప్పనప్పటికి రెండో పార్ట్ తో మాత్రం బన్నీ అదరగొట్టేశారు. ఊహించని విధంగా రెండు వేల కోట్లు రాబట్టాడు. అలా కెరీర్ బిగినింగ్ ఎన్నో విమర్శలు అందుకున్న బన్నీ తెలుగు చిత్ర సీమలో ఇంతవరకు ఎవ్వరికీ సాధ్యం కానీ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుని సాధించాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీర్ వంటి వారికే ఆ అవార్డు దక్కలేదు. అలా బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందడం టాలీవుడ్ కి ఎంతో గర్వకారణం.