తెలంగాణకు రెయిన్ అలెర్ట్..

rain-10.jpg

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆ శాఖ ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, బి. కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌కు IMD ఎల్లో అలెర్ట్ జారీ చేయనప్పటికీ, అక్టోబర్ 12 వరకు నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. లా నినా పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాల్లో చలి తీవ్రత ఓ రేంజ్‌లో ఉంటుందని తెలిపింది. పొగమంచు ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

Share this post

scroll to top