భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేస్తే ఆ దేశం మాత్రం ఇండియాలో సాధారణ పౌరులు, ఆర్మీ స్థావరాలు లక్ష్యంగా దాడులకు దిగింది. ఆ దాడులను తిప్పికొడుతూనే భారత్ దాయాది దేశంపైకి డ్రోన్స్ దాడి చేసింది. పాకిస్థాన్ పీఓకేలో మొత్తం 13 ప్రాంతాలపై భారత్ డ్రోన్ దాడులు చేసింది. ముఖ్యంగా టెర్రరిస్టు క్యాంపులు, ఆర్మీ స్థావరాలపైనే భారత్ దాడులు చేసింది. అందులో కొన్ని డ్రోన్లు లక్ష్యాలను చేదించగా మరికొన్ని డోన్లను పాకిస్థాన్ ఆర్మీ అడ్డుకుంది. కొన్ని డ్రోన్లు ఒకారా మరియు బహవాల్ నగర్ ప్రాంతాల్లో దాడి చేశాయి. అంతే కాకుండా ఆరిఫ్ వాలా, రావల్పిండి, అట్టోక్, గుర్జాన్ వాలా, లాహోర్, షెయిక్ పురా, గోట్కి, మాలిర్, పాక్ పట్టాన్, విహారీ, గుజరాత్ ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు చేసింది. ఒకారా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారత్ కు చెందిన నాలుగు డ్రోన్లను పాకిస్థాన్ అడ్డుకుంది. భారత్ చేసిన డ్రోన్ దాడులతో పాకిస్థాన్, పీఓవోకే కొన్ని చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత్ డ్రోన్ దాడుల తరవాత గాయపడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకువెళుతున్న వీడియో కూడా వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌లోని 13 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడి..
