శనివారం తెల్లవారుజామున భారత్లోకి వచ్చిన పాక్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. భారత్లోని పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన ఖాసా కంటోన్మెంట్ పరిధిలోని సాధారణ పౌరులపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. గగనతలంలో పాక్ డ్రోన్లను గుర్తించిన ఇండియన్ ఆర్మీ అప్రమత్తమై వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. తమ దగ్గరున్న అధునాత ఆయుధాలతో పాకిస్తాన్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ నేల కూల్చింది. ఇకపోలే సాధారణ పౌరులపై పాక్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ ఆర్మీ తన “ఎక్స్” ఖాతా ద్వారా వెలువరించింది.
మరోవైపు భారత్లోని ప్రధాన నగరాల టార్గెట్గా పాకిస్తాన్ ఫతాహ్ -2 మిస్సైల్ ను ప్రయోగించింది. కానీ ఆ మిసైళ్లను భారత్ ఆర్మీ సమర్ధవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్ మిసైళ్లను భారత్ గాళ్లోనే అంతమొందించింది. పదే పదే డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్కు బుద్ది చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్ -2 పేరుతో పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్టు తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సహా మరో మూడు పాక్ ప్రధాన వైమానిక స్థావరాలపై బిలిస్టన్ క్షిపణి సహా, మిస్సైళ్లు, డ్రోన్ల వర్ష కురిపించింది. భారత్ దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భారత్ సైన్యం ప్రతీకార చర్యలతో బెంబేలెత్తిపోతున్న పాకిస్థాన్ తన గగన తలాన్ని మూసివేసింది.