సోషల్ మీడియాలో ఏదోరకంగా వైరల్ కావాలి. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి ఈ పిచ్చి కొందరి ప్రాణాల మీదకు తెస్తుంది. కొన్ని సాహసాలతో రీల్స్ చేస్తు్న్నారు. మరికొందరు డ్యాన్స్ లతో ఇంకా కొందరు బూతులతో రెచ్చిపోతూ ఫేమస్ అవుతున్నారు. వ్యూస్, లైక్‌లు షేర్ల కోసం దేనికైనా రెడీ అవుతున్నారు. ఇన్‌స్ట్రామ్ రీల్స్ కోసం ఓ విద్యార్థి కాలువలోకి దిగి గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టా రీల్స్ కోసం నలుగురు స్నేహితులు సీతానగరం మండలంలోని పేరంటమ్మ కాలువ వద్దకు వెళ్లారు. కాలువలోకి దిగి రీల్స్ చేస్తున్న సమయంలో వినయ్ అనే విద్యార్థి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. అతడిని రక్షించడానికి స్నేహితులు, స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
కాలువలోకి దిగి టెన్త్ విద్యార్థి గల్లంతు..
