ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుండి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో ఎవరు అధికారం చేపడతారో అనే విషయం తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు ముందు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఈసీకి నివేదిక ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని నివేదికలో పేర్కొంది.