టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార. మొదట ప్రిన్స్ మహేష్ బాబు ఫేమ్‌తో గుర్తింపు దక్కినా ఆ తర్వాత తన టాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న సితార డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. అంతేకాదు ఓ ప్రముఖ జ్యూయెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఓ హీరోయిన్ అందకునేంత రెమ్యునరేషన్ తీసుకుంది. సితార ఇప్పటి వరకు సినిమాల్లో నటించలేదు. కేవలం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఇంత ఫేమ్ సంపాదించుకుంది. అయితే సితార తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రతా కృషి చాలా ఉంది. డ్యాన్స్,యాక్టింగ్, హావభావాలు పలికించడంలో రాటుదేలేలా ట్రైనింగ్ ఇప్పించింది. ఇలా చిన్నప్పటి నుంచే సితారపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో చిన్న వయసులోనే స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
హీరోయిన్లను మించి ఫాలోయింగ్..
