పెద్ది సినిమాలో ఐటెం సాంగ్ కు కొత్త కష్టాలు..

pedhi-29-1.jpg

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తాజాగా చేస్తున్న సినిమా పెద్దిప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఐటెం సాంగ్ విషయంలో తీవ్ర గందరగోళం ఉంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఏ హీరోయిన్ అనేది ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. మొదట సమంత, ఆ తర్వాత పూజ హెగ్డే, శ్రీ లీల, మరో బాలీవుడ్ హీరోయిన్ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో చేయించాలి అనే దాని పైన క్లారిటీ రాలేదు.

ఇలాంటి నేపథ్యంలో ఒక కొత్త టెన్షన్ చిత్ర బృందంలో నెలకొంది. దేశ వ్యాప్తంగా ఎన్నో రొమాంటిక్ అలాగే ఫీల్ గుడ్ సాంగ్స్ చేసిన ఏఆర్ రెహమాన్ ఐటెం సాంగ్ ఎలా చేస్తాడు అనే దానిపైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. తెలుగులో దేవి శ్రీ ప్రసాద్ లేదా తమన్ చేస్తేనే ఐటమ్ సాంగ్. ఈ ఇద్దరు చేసిన ఐటమ్ సాంగ్స్ చాలా వరకు హిట్ అయ్యాయి. మరి ఏ ఆర్ రెహమాన్ వీళ్ళ రేంజ్ ను మించిపోతాడా? తేలిపోతాడా ? అనే టెన్షన్ మొదలైంది. ఏఆర్ రెహమాన్ చాలా బాగా చేసినా తెలుగు జనాలకు ఎక్కాలి. లేకపోతే ఐటెం సాంగ్ వృధా అవుతుంది.

Share this post

scroll to top