వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తారు. అలాగే ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం పదిహేడు మంది మరణించారు. దాదాపు నలభై మంది వరకూ గాయపడ్డారు. వారందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉదయం పది గంటలకు బయలుదేరి పదకొండు గంటలకు విశాఖకు చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జగన్ పరామర్శ..
