2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలపై వైసీపీ నేతలు చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ.. దమ్ముంటే.. షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్‌కు, ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ కౌన్సిలింగ్‌ను వెంటనే నిర్వహించాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. పిల్లందరికీ అమ్మఒడి ఇస్తామని నాడు జగన్ చెప్పి మాట తప్పారని మస్తాన్ వలి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే విధంగా హామీలు ఇచ్చి.. అమలు చేయడం లేదన్నారు.
దమ్ముంటే షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్‌కు సవాల్
