వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా చిలంకూరు ఎల్‌అండ్‌టీ సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన వివాదంపై వైసీపీ నేతల చేస్తున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు. సిమెంట్ పరిశ్రమల నుంచి వైసీపీ నేతలు లబ్ది పొందారని చెప్పారు. జమ్ముకశ్మీర్ ముష్కరుల కంటే ఇక్కడ వైసీపీ వాళ్లు చాలా డేంజర్ అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి లేకుండా చేస్తామని హెచ్చరించారు. వైసీపీ పార్టీ త్వరలోనే కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. వచ్చేసారి వైసీపీకి ఈ 11 సీట్లు కూడా రావని ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు.
జగన్‌ను రాజకీయాల నుంచి లేకుండా చేస్తాం..
