తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశంలో కీలక పరిణామం.. 

janareddy-01.jpg

కేబినెట్‌లో ఆరు ఖాళీలు ఉండగా ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నాలుగు కోసం సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్‌ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి పోటీపడుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల వారికి అవకాశం ఇస్తే మల్ రెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ ఉంటుందని అదే జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండకపోవచ్చనే టాక్ ఉంది. అయితే అనేక సామాజిక, రాజకీయ కోణాల్లో లెక్కలు వేసుకున్న తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుంది. కాబట్టి తుది జాబితాలో ఎవరికి అవకాశం ఉంటుందో చెప్పడం కష్టమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం దగ్గర పడిందనే సమయంలో జానారెడ్డి వంటి సీనియర్ నేత లేఖ రాయడం కీలక పరిణామమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

Share this post

scroll to top