జానీ మాస్టర్‌పై కీలక చర్యలు తీసుకున్న జనసేన పార్టీ..

jani-16.jpg

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆయనపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. తక్షణం నిర్ణయం అమలులోకి వస్తుందని పార్టీ వేముల అజయ్‌ కుమార్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణను నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

Share this post

scroll to top