ఎమ్మెల్సీగా జనసేన నేత కొణిదెల నాగబాబు తొలి అధికారిక ప్రకటన ఉద్రిక్తతకు దారి తీసింది. గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అయితే ప్రారంభ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు. తమ్ముళ్లకు కౌంటర్ జనసైనికులు జై జనసేన అంటూ కౌంటర్ నివాదాలు చేశారు. నాగబాబు ప్రారంభ హడావిడిలో ఉండగానే కాసేపు ఆ పోటాపోటీ నినాదాల పర్వం కొనసాగింది. దీంతో ఆయన వాళ్ల వంక ఓ లుక్కేసి ఏమీ పట్టనట్లు తన కార్యక్రమంలో మునిగిపోయారు. ఈలోపు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు.
నాగబాబు పర్యటనలో రసాభాసా..
