జనసేన అధినేత కోణెదెల పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో పిఠాపురం పేరు ఒక్కసారిగా దేశ స్థాయిలో వినబడింది. మరి అలాంటి పిఠాపురంపై పవన్ కళ్యాణ్ సైతం పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. గతంలో చూసుకుంటే ఈ పిఠాపురంలో ఉన్న బస్టాండ్ అత్యంత దయానీయంగా ఉండేదని స్థానికుల పేర్కొంటున్నారు. బస్టాండ్ అంతా అపరిశుధ్యంతో చినుకు పడిందా చిత్తడి చిత్తడి అన్న మాదిరిగా వాతావరణం ప్రధానంగా బస్ స్టాండ్ లో బస్సులు ఎక్కేందుకు మనుషులే ఉండేవారు కాదని ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆర్టిసీబస్టాండ్ పై పూర్తిగా దృష్టి సారించారు. పూర్తిగా బస్టాండ్ రంగుల మయంగా కనిపిస్తుంది మరొక ఎంట్రెన్స్ బోర్డు ముఖ్యంగా అత్యంత ఖాళీ ప్రదేశంలో ఈ పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్ ఉండడంతో చుట్టుపక్కల అనేక చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో అపరిశుద్యం తొలగించి ఆ చెట్లు పెంపకంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
పవన్ కళ్యాణ్ రాకతో పిఠాపురంకి మహర్దశ పట్టబోతుందంటూ ప్రజల పేర్కొంటున్నారు..
