విశాఖ డిప్యూటీ మేయరుగా జనసేన పార్టీకి చెందిన కార్పరేటర్ దల్లి గోవిందరెడ్డి ఎన్నికయ్యారు. నిన్న కోరం లేక వాయిదా పడిన ఎన్నిక ఈ రోజు జరిగింది. గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 59 మంది సభ్యుల కోరంతో సమావేశం నిర్వహించారు. నిన్నటి సమావేశానికి ఇద్దరు టీడీపీ సభ్యులు హాజరు కాకపోవడంతో కొంత ఉత్కంఠ ఏర్పడింది. అసంతృప్తులను బుజ్జగించడంతో ఈ రోజు వారు సమావేశానికి హాజరయ్యారు. దీంతో కూటమి ప్రతిపాదించిన 64వ డివిజన్‌కు చెందిన జనసేన కార్పొరేటర్గోవిద్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఎట్టకేలకు ముగిసిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక..
