ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి స్థానిక ఆస్పత్రిలో మార్క్ చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే తండ్రి పవన్ కళ్యాణ్, పెద్దనాన్న చిరంజీవి, పెదమ్మ సురేఖ మార్క్ ను చూసేందుకు సింగపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాలు కీలక అప్డేట్ ఇచ్చాయి. మార్క్ శంకర్ కు సింగపూర్ లోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని జనసేన వర్గాలు వెల్లడించాయి. తమ అధినేత చిన్న కుమారుడు అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నాడని తెలిపాయి. అయితే మంగళవారం రోజున ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన వైద్యులు బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి సాధారణ గదికి మార్క్ ను తరలించినట్లు చెప్పాయి. మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి మార్క్ శంకర్ కు పలు పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించాయి.
మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన జనసేన..
