మరో స్టార్ హీరో సినిమాలో జాన్వీ

jhavi-18.jpg

శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ.. ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ ఫేమ్ ఓ మాదిరిగా వచ్చింది. యాక్టింగ్ పరంగా ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘దేవర’లో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. సెప్టెంబరులో మూవీ రిలీజైతే ఈమె భవిష్యత్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతోనే ఈమె బాగా ఫేమస్. చాన్నాళ్ల క్రితమే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవర, RC 16 ప్రాజెక్టులపై బోలెడు ఆశలు పెట్టేసుకుంది. ఈ రెండు ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే మూడో అవకాశం కూడా పట్టేసిందట.

Share this post

scroll to top