ఆనందంగా ఉందంటూ జాన్వీ పోస్ట్..

janvi-11.jpg

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆమె నటించిన సినిమాను ఈ ఏడాది జరగనున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతుండటం విశేషం. నీరజ్ ఘేవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రాన్ని మే 13 నుంచి 24 వరకు జరగబోతున్న ఫ్రాన్స్ వేదికలో ప్రదర్శించబోతున్నారు. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. కేన్స్‌ను సెలెక్ట్ అయిన ప్రకటన విడుదల చేస్తూ భారతీయ సినిమా ప్రపంచాన్ని ఆకర్శించే క్షణాలివి. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా ‘హోమ్‌బౌండ్’ సినిమా సందడి చేయబోతుంది.

ఇది మా టీమ్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. ఆనందంతో మా హృదయాలు నిండిపోయాయి. దీన్ని మీ అందరి ముందుకు తీసుకురావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ మొదటి మూవీ కూడా కెన్స్‌లో ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హోమ్‌బౌండ్ రెండో చిత్రం కావడం విశేషం. ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

Share this post

scroll to top