గత 24 ఏళ్ల రికార్డును హేమంత్ సర్కార్ బ్రేక్ చేశారు. ప్రతి ఐదేళ్లకు అక్కడ ప్రభుత్వాన్ని మార్చుతున్నారు ఓటర్లు. ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోలేదు. అయితే ఈ సారి వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా హేమంత్ సోరెన్ దూసుకుపోతున్నారు. హేమంత్ సోరెన్ బర్హైత్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్ పై 2,812 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. అయితే యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండియా కూటమి విజయం సాధిస్తుందని అంచనావేసింది. ఇండియా కూటమికి 53 సీట్లు, ఎన్డీయేకి 25 సీట్లు దక్కే అవకాశముందని తెలిపింది.
మళ్లీ హేమంత్‌కే పట్టం..
