దేవర’కు నో ఈవెంట్స్..

ntr-28.jpg

యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిషున్న ‘దేవర’ నిర్మాణ సంస్థ ఎన్టీయార్ ఆర్ట్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి సరైన ప్లానింగ్ లేకుండా నిర్లక్యంగా వ్యహరిస్తున్నారని, సినిమా సంబంధించి అప్ డేట్స్ సరైన టైమ్ కు ఇవ్వకుండా ఫ్యాన్స్ ను తీవ్ర నిరుత్సహానికి గురిచేసారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను కూడా ముంబై నిర్వహించి, ప్రెస్ మీట్ ను తమిళనాడులో నిర్వహించి తెలుగు ఆడియెన్స్ ను పూర్తి గా పక్కన పెట్టేసారు.

ఈ ఆదివారం నిర్వహించ తలపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర ఆవేదానికి గురయ్యారు. ఇప్పటికి తెలుగులో ఒక్క ఈవెంట్ కుడా నిర్వహించలేదు నిర్మాణసంస్థ. దాదాపు 6 ఏళ్ల తర్వాత టైగర్ సినిమా సోలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్  భారీగా తరలివచ్చారు.  ఆ ఈవెంట్ కూడా నిర్వహించలేక చేతులెత్తేస్తూ క్షమాపణలు తెలిపారు నిర్మాణ సంస్థ. ఇదిలా ఉండగా  తారక్ కూడా తెలుగు ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసి అమెరికా బయలుదేరాడు. అక్కడ జరిగే కు హజరుకానున్నాడు.  అక్కడ ప్రమోషన్స్ నిర్వహించి ఈ నెల 27న ఉదయం హైదరాబాద్ రానున్నాడు. సో తెలుగులో ఇక దేవరకు సంబంధించి ఏ ఈవెంట్ లేనట్టే. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ను మనోవేదనకు గురి చేస్తుంది.

Share this post

scroll to top