దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, నటులు, సెలబ్రిటీలను యువత, విద్యార్థులు రోల్ మోడల్‌గా తీసుకుంటారని, కానీ వారంతా ప్రస్తుతం సైతాన్లుగా మారారని, ఈ క్రమంలో బెట్టింగ్, గేమింగ్ యాప్ లకు ప్రమోషన్స్ చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. యువతను చెడు మార్గంలో నడిపే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రేటీలు, నటులు తమ తప్పును ఒప్పుకొని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, వారి వల్ల నష్టపోయిన వారికి వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇది బెదిరింపు కాదని వారందరిని ఈడ్చుకెళ్తానని ఈ సందర్భంగా కేఏ పాల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్..
