హైకోర్టు తీర్పుచాలా మంచిది కూనంనేని..

kadiyam-9.jpg

హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకుంటే సంతోషించే వాళ్లం. మేమే పార్టీ మారితే వెంటనే ఆటో మేటిక్‌గా అనర్హత వేటు పడాలి. పార్టీ మారిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాల”ని ఆయన వ్యాఖ్యానించారు.

పార్టీ ఫిరాయింపులపై కోర్టులు భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయంటూ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టుల భిన్నమైన తీర్పులపై అధ్యయనం జరగాలి. ఇలాంటి తీర్పులపై రాజ్యాంగ ధర్మాసనం వద్ద చర్చ జరగాలి. ఒక అంశంపై సుప్రీంకోర్టే రెండు భిన్నమైన తీర్పులు ఇస్తోంది. ఫైవ్ జడ్జెస్ ధర్మాసనం ఒక రకంగా, త్రీ జడ్జెస్ బెంచ్ మరో రకంగా స్పందిస్తోంది. ఈనాటి ఫిరాయింపుల అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక రకంగా, సింగిల్ జడ్జ్ బెంచ్ మరోరకంగా స్పందించింది. నా విషయంలో కోర్టు తీర్పుపై నేను వ్యక్తిగతంగా పోరాటం చేస్తాను.

Share this post

scroll to top