కేంద్ర ప్రభుత్వ సంస్థతో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం జరగలేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలని హితవు పలికారు. 9 వేల మెగా వాట్స్ విద్యుత్‌ని ఇస్తామని ‘సెకి’ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించి ఈ ఒప్పందాన్ని చేసుకుంది. 2014-19 మధ్య యూనిట్ ధర రూ.6.90 పైసలకి చంద్రబాబు కొనుగోలు చేస్తే మా హయాంలో 2.49 పైసలకే ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. సోమవారం నెల్లూరులో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై ఉన్న ద్వేషాన్ని ఎల్లో మీడియా ఇంకోసారి భళ్లున కక్కినట్లు కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఎల్లో మీడియా చిమ్ముతున్న విషం చూస్తే వారికి వైయస్ జగన్‌పై ఉన్న అక్కస్సు ఏ స్థాయిదో సామాన్యుడికీ తెలిసిపోతుంది. పిచ్చి ముదిరిందంటే రోకటికి చుట్టమన్నట్లు ఇప్పుడు వారు అమెరికా కోర్టుల తరఫున కూడా తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోర్టులు ఏ రకమైన తీర్పులు ఇవ్వాలో ఈ మీడియా చెబుతూంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి అమెరికా స్థాయికి ఎదిగారన్నమాట. ప్రజలను మోసం చేసేందుకు వీరు కల్లుతాగిన కోతుల్లా అర్థంపర్థం లేని కథనాలు వండి వార్చారు.