సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు గడిచిన రెండుసార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయం అందించడంతోపాటు, ఈసారి కూడా గణనీయంగా ఓట్లు వేసి, ఆదరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అధికారం, పదవులు శాశ్వతం కాదు, ఎప్పటికీ మీ ప్రేమ, అభిమానాలకు దూరం కాను. నేడు అధికార మదంతో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులపై, ఆస్తులపై ఎవరైతే దాడులు చేస్తున్నారో వారి చేతే తిరిగి పునరుద్ధరించే రోజు ఖచ్చితంగా వస్తుంది. అన్యాయాన్ని ధైర్యంగా ఎదురుకుంటాం..ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా నిలుస్తాం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ శ్రేణులకు ఎక్కడ అన్యాయం జరగనివ్వను. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంతోపాటు వివిధ అభివృద్ధి పనులను చేపట్టాం. అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజల మధ్య ఉండి, ప్రజలకు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలబడుతాం. నేనంటూ ప్రజా జీవితంలో ఉన్నంతవరకు ఎవరు అధైర్య పడవద్దు, అందరికీ అండగా నిలబడుతా.. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలు నా కుటుంబ సభ్యులు లాంటి వారు, వారికి అన్నివేళలా తోడునీడగా నిలుస్తా.
అధైర్య పడవద్దని అన్ని విధాలా అండగా ఉంటామని కాకాణి భరోసా..
