కాకినాడ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం..

five-monts-07.jpg

కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతంలోని జగ్గయ్య చెరువు కాలనీలో అమానుష ఘటన ఒక్కసారిగా ఊరిని హడలెత్తించింది. మానవత్వాన్ని మరిచిపోయిన విధంగా చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదు నెలల చిన్నారిని క్షుద్రపూజల కోసం బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఓ తల్లి తన ఐదు నెలల బిడ్డను ఇంట్లో తన పక్కనే పెట్టుకుని నిద్ర పోతుంది. అయితే అర్ధరాత్రి తల్లి మేల్కొనగా పాప పక్కన కనిపించలేదు. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడం గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే చుట్టుపక్కల వెతుకున్న వారికి ప్రక్కింటి బావిలో చిన్నారి మృతదేహాం లభించింది. 

Share this post

scroll to top