‘కల్కి’ ట్రైలర్ విడుద‌ల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..?

kalki-.jpg

రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన గ్లింప్స్, పోస్టర్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్ ఇలా మూవీపై భారీ అంచనాలను నెల‌కొల్పాయి. హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రం ఉండబోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇక ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ఈ నెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో ట్రైలర్ విడుదల తారీఖును మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. జూన్ 10వ తేదీన మూవీ ట్రైల‌ర్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా చిత్రం యూనిట్‌ ప్రకటించింది.

కాగా, ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో జరగనుంద‌ని స‌మాచారం. టాలీవుడ్‌ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై కే. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, విశ్వ‌న‌టుడు కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

Share this post

scroll to top