కల్కి’లో ‘కలి’ ఎవరు నాగ్‌ అశ్విన్‌ ఏం చూపించబోతున్నాడు..

kalkey-26.jpg

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ జోడీంచి సరికొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌,కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె లాంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్‌ సాంగ్‌ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు నాగ్‌ అశ్విన్‌ ఏం చెప్పబోతున్నాడనేదానిపై కాస్త క్లారిటీ వచ్చింది. కథ మొత్తం ‘కల్కి’ పాత్ర చుట్టే తిరుగుతుంది. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర అశ్వత్థామ. కృష్ణుడి శాపంతో శారీరక రోగాలతో బాధపడుతున్న ఆయన.. ‘కల్కి’ అవతార ఆవిర్భావానికి ఎందుకు సాయం చేస్తున్నాడని మరో ఆసక్తికరమైన పాయింట్‌. సుప్రీం యాస్కిన్‌ పాత్రే కలిగా మారుతుందా? అంటే ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అవుననే అంటారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో కమల్‌ పోషించిన సుప్రీం యాస్కిన్‌ పాత్ర  ‘ఎన్ని యుగాలైనా మనిషి మారడు.. మారలేడు’ అనే డైలాగ్‌ చెబుతాడు. పురాణాల ప్రకారం కలి అనేవాడు మానవుడిలో ఉన్న అరిషడ్వర్గాలను ఆసరగా చేసుకొని ఆడుకుంటాడు. కమల్‌ చెప్పిన డైలాగ్‌ను బట్టి చేస్తే ఆయనే కలి అని అర్థమవుతుంది. భైరవగా నటించిన ప్రభాస్‌నే కల్కిగా చూపించబోతున్నారా? లేదా పుట్టబోయే ‘కల్కి’ని రక్షించే వ్యక్తిగా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రను ప్రభాస్‌ పాత్ర చేతిలోనూ చూపించారు. అంటే ‘కల్కి’ని రక్షించే బాధ్యత భైవర తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా మన ఊహ మాత్రమే.  డైరెక్టర్‌ నాగి అల్లుకున్న కథలో కలి ఎవరు? కల్కి ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు(జూన్‌ 27 రిలీజ్‌)ఆగాల్సిందే.

Share this post

scroll to top