గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం RC16 కోసం.. ‘ఉప్పెన’ ఫేమ్, యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్స మర్పణలో వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం గత నెలలో హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ రోజు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాల్లోకి ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు.
RC16 నుంచి అదిరిపోయే అప్డేట్.. తెలుగులోకి కన్నడ సూపర్ స్టార్ ఎంట్రీ
