అసెంబ్లీకి బయలుదేరిన కేసీఆర్..

kcrr-12-.jpg

బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితమే హైదరాబాద్‌ నందినగర్‌ లోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఈ పరిణామంలో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అయితే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ప్రసంగించనున్నారు. అనంతరం సభలో చర్చించే అంశాలపై ఎజెండా ఖరారు చేసేందుకు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఆ మీటింగ్‌లో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో పలు అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరగే అవకాశం ఉంది.

Share this post

scroll to top