గులాబీ బాస్ కేసీఆర్ గత కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉండడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మినహాయిస్తే ఎలాంటి కార్యక్రమాలలో ఆయన పాల్గొనలేదు కేసీఆర్. మరికొన్ని రోజుల పాటు సైలెంట్‌గానే ఉండే అవకాశం కనిపిస్తోంది. కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తే తప్ప కేసీఆర్ పొలిటికల్ స్క్రీన్‌పై మళ్లీ యాక్టివ్ కనిపించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినా వార్తే మౌనంగా ఉన్నా వార్తే. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు అదే పంథాను కొనసాగిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం సాగిన 12 ఏళ్ల పాటు కేసీఆర్ సైలెంట్‌గా ఉంటే వ్యూహాత్మక మౌనం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. తెలంగాణలో రెండు విడతలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కూడా అవసరమనుకుంటే తప్ప మీడియా ముందుకు వచ్చేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే కేసీఆర్ మీడియా సమావేశాలను ఏర్పాటు చేసినా బహిరంగ సభలో పాల్గొన్నా ఏదో ప్రత్యేకత ఉంటుందని అందరూ భావిస్తారు.
గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ యాక్టివ్‌గా కనపడేది అప్పుడేనా..
