కేసీఆర్ సభ పై రాములమ్మ హాట్ కామెంట్స్..

vijaya-santhi-28.jpg

వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై పోలీస్ వ్యవస్థ పై చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ స్పీచ్ పై ఆమె ఎక్స్ ద్వారా స్పందిస్తూ తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులను తొత్తులుగా వాడుకుని, చట్ట విరుద్ధంగా పోలీసులతో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారు. మీ ఉచ్చులో పడిన కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటడం వల్ల, ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి, దొంగల మాదిరిగా దాక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గుర్తు చేశారు.

అలాగే బీఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్కౌంటర్ చేయించిన కేసీఆర్ ఇప్పుడు మావోయిస్టులను చర్చలకి పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం కేవలం అవసరం వాదం మాత్రమేనని అభిప్రాయ పడ్డారు. పాతికేళ్ళ బీఆర్ఎస్ ప్రస్థానంలో తెలంగాణను అభివృద్ధి చేశామని కేసీఆర్ చెప్పుకుంటున్నారని మరి పాతిక సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధి చెందిందా లేకుండా కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందిందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఒకొక్కరి ఆస్తులు ఎన్ని వేల కోట్లకు చేరాయో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధమా అన్ని ఎమ్మెల్సీ విజయశాంతి సవాల్ విసిరారు.

Share this post

scroll to top