టీడీపీ సర్కార్‌ కు కేతిరెడ్డి వార్నింగ్‌..

kethi-reddy-08.jpg

అనంతపురం లోని చెరువు కబ్జా నోటీసులపై ఫేస్ బుక్ ల్తెవ్ ద్వారా స్పందించారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రిమిరెడ్డి. చీకటి ఉన్నట్టే పగలు కూడా ఉంటుందని కచ్చితంగా వీటన్నింటికీ సమాధానం ఇచ్చే రోజు వస్తుందని టీడీపీ సర్కార్‌ కు వార్నింగ్‌ ఇచ్చారు. నా భూముల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నానని ఈ విషయం హైకోర్టులో ఉన్నప్పటికీ అధికారులు నోటీసులు ఇచ్చారని ఆగ్రహించారు. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని నా నోటీసుల వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని తెలిపారు.

నాపై చేసిన ఆరోపణలు మీద గతంలోనే హైకోర్టుకు వెళ్లానన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రిమిరెడ్డి. కాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ అయ్యాయి. చెరువు స్థలం వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారట. ఏడు రోజుల్లో ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. భూమి కబ్జా గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం అందుతోంది.

Share this post

scroll to top