అంబేడ్కర్‌ విగ్రహంపై పచ్చమూక దాడిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువ..

ysrcp-10.jpg

విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాంపై టీడీపీ పచ్చమూకలు దాడిచేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్వీయూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురు­మల్లి రామ్‌కుమార్‌రెడ్డి వాకాడులో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామినేటి కేశవులు, పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వ­యకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి పేరూరులో అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహంపై దాడిపట్ల డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ స్పందించాలని ఏపీ అంబేడ్కర్‌ యువజన సంఘం జిలాల్లా కార్యదర్శి వై. శివ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాతకే దిక్కులేదంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పుత్తూరులో అన్నారు.

Share this post

scroll to top