ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ ఓట్లతో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో గంట గంటలకు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ 43 స్థానాల్లో, ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్న 10 స్థానాల్లో కేవలం వందల్లో లీడ్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇలానే కొనసాగితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ లో సెటైరికల్ ట్విట్ చేశారు. బీజేపీ ని గెలిపించినందుకు రాహుల్ గాంధీ కి కంగ్రాట్స్’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.
రాహుల్ గాంధీకి సెటైరికల్ ట్వీట్..
