పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతున్నదని, పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తున్నదని మండిపడ్డారు. పల్లె ప్రగతి పేరుతో తాము చేపట్టిన కార్యక్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా..
