సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడన్నారు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశామని, ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు చెప్పారన్నారు కేటీఆర్. దీంతో తప్పించుకునేందుకు చావు తెలివితేటలు స్టార్ట్ చేయటం మొదలు పెట్టాడని, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్లు కట్టేస్తా అని 9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడాడని, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15 కు రుణమాఫీ చేస్తా అని చెప్పాడన్నారు కేటీఆర్. ఆగస్ట్ 15 పోయింది. రుణమాఫీ కాలేదు. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండని, దైవ ద్రోహం చేసిండు ఈ దుర్మార్గుడని, కేసీఆర్ ను తిట్టి నాలుగు ఓట్లు వేయించుకొని ఆ తర్వాత అవతలపడ్డాడన్నారు కేటీఆర్ అన్నారు.
దైవ ద్రోహం చేసిండు ఈ దుర్మార్గుడు..
