సర్కార్‌కు దిమ్మతిరిగిందా కేటీఆర్ హాట్ కామెంట్స్..

ktr-04.jpg

కంచె గ‌చ్చిబౌలి పరిధిలోని మొత్తం 400 ఎక‌రాల భూ వ్యవహారంలో సుప్రీం కోర్టు సీరియస్ అయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి ఆదేశించింది. మరోవైపు హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంపై ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. అందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రలు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే, వారు హెచ్‌సీయూ యాజమాన్యం, విద్యార్థులు, ఆయా ప్రజా, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరుపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే భూమిలో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న 400 ఎకరాల్లోనే కాకుండా యూనివర్సిటీ భూములు 1,600 ఎకరాలను కలిపి 2 వేల ఎకరాల్లో అతి పెద్ద ఎకో పార్క్‌ గా రూపొందించాలని సర్కార్ డిసైడ్ అయినట్లుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై ‘X’ వేదికగా మాటలతో విరుచుకుపడ్డారు. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్‌గా ప్రకటించి నగరంలోనే బెస్ట్ ఎకో పార్క్‌ గా తయారు హెచ్‌సీయూ కి కానుకగా ఇస్తామని ప్రకటించిన వెంటనే 24 గంటలు తిరగక ముందే 2 వేల ఎకరాల్లో ఎకో పార్క్ అంటూ కాంగ్రెస్ సర్కారు బీరాలు పలుకుతోందని అన్నారు. సుప్రీం ఆదేశాలతో సర్కారుకు దిమ్మతిరిగిందని ఎకో పార్క్ నిర్మాణం అంటే ఏఐ వీడియో తయారు చేసినంత ఈజీ కాదన్నారు. ఇక నైట్ సఫారీ అంటే రాత్రికి రాత్రే వందల జేసీబీలు, టిప్పర్లతో చొరబడి విధ్వంసం చేయడం కాదని సెటైర్లు వేశారు.

Share this post

scroll to top