వ్యవసాయ మంత్రి ప్రకటనతో మరోసారి బండారం బట్టబయలైందని, అధికారికంగానే 20 లక్షల మంది ఉంటే, అనధికారికంగా ఇంకెంత మంది ఉన్నారో? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ మరో 20 లక్షల మందికి చేయాల్సి ఉందని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని, వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు.
మరోసారి బండారం బట్టబయలు..
