షాబాద్‌లో బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా..

brs-17.jpg

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టొద్దు. ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరాను. తెలంగాణలో ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే మా ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామాని చెప్పాను. అయినా కానీ సీఎం మాట్లాడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు నాట్లు వేసే సమయానికి డబ్బులు పడుతుండేవి. కానీ రేవంత్ రెడ్డి ఓట్ల అప్పుడు రైతులకు డబ్బులు ఇస్తాను అంటున్నాడు.

చేవెళ్లలో ఉప ఎన్నిక రాబోతుంది. మీరు చేవెళ్లలో కేసీఆర్ కు ఓటేశారు, ఎమ్మెల్యేని గెలిపించారు. కానీ చేవెళ్ల ఎమ్మెల్యే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఎవరి అభివృద్ధి కోసం వెళ్ళాడో అందరికీ తెలుసు. చేవెళ్లలోనే కాదు తెలంగాణలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2025లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు వస్తాయి. వాళ్ళను ఓడించాలి. రైతుల తరుపున ఇది ఆరంభం మాత్రమే. 21వ తారీఖున నల్గొండలో మరో రైతు దీక్ష పెడతాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

Share this post

scroll to top