మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ కు ఓట్లేయొద్దు..

ktr-24.jpg

మహారాష్ట్ర‌లో నవంబ‌ర్‌ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ లుచ్చ‌గాళ్ల‌కు ఓటేయొద్ద‌ని మ‌హారాష్ట్ర‌లో ఉన్న బంధువుల‌కు, దోస్తుల‌కు గ‌ట్టిగా చెప్పండి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

న‌వంబ‌ర్‌లో మ‌హారాష్ట్ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఆదిలాబాద్ వాళ్ల‌కు అక్క‌డ‌ చుట్టాలు, దోస్తులు ఉంటారు. కాంగ్రెస్ లుచ్చ‌గాళ్ల సంగ‌తి వారికి తెలియ‌జెప్పండి మేం మోసం పోయాం మీరు మోస‌పోకండి అని చెప్పండి. రైతు భ‌రోసా, తులం బంగారం, పెన్ష‌న్లు, స్కూటీలు అని క‌థ‌లు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేశారు. ఈ కాంగ్రెస్ లుచ్చ‌గాళ్ల‌కు ఓట్లేస్తే మ‌ళ్లా మోసం జ‌రుగుత‌ద‌ని గ‌ట్టిగా చెప్పాలని కేటీఆర్ సూచించారు.

Share this post

scroll to top